కండల వీరుడికి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా..?

కండలవీరుడు అనగానే ముందుగా సల్మాన్ ఖాన్ గుర్తొస్తారు.. బాలీవుడ్ లోనే కాదు మిగతా సినీ పరిశ్రమలో కూడా సల్మాన్ ఖాన్ అంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన బాడీ లాంగ్వేజ్ కి అమ్మాయిలు కూడా ఫిదా అయిపోతారు . అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన దాదాపు చాలా సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇకపోతే ఈయన మిగతా సినిమాలకు వందల కోట్ల పారితోషికం తీసుకుంటే , మేకింగ్ సినిమాలకు మాత్రం కేవలం రూ. 50 నుండి రూ.60 కోట్లు మాత్రమే తీసుకోవడం గమనార్హం .

ఇకపోతే ప్రేక్షకులకు సినిమా కథ ఎలా ఉన్నా..? నిర్మాతలు ఎవరైనా సరే సల్మాన్ ఖాన్ సినిమా అంటే మాత్రం జనాలు ఎగబడి చూస్తారు. కేవలం సల్మాన్ ఖాన్ కోసమే బయ్యర్లు కూడా ఎగబడి సినిమాను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు.. అనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలకు కొంచెం దూరంగానే ఉంటూ వచ్చాడు. నిజానికి సల్మాన్ ఖాన్ చేసే సినిమాలు మాత్రం తక్కువ బడ్జెట్ తోనే ఉంటాయి.. కానీ సల్మాన్ ఖాన్ స్టార్డం తోనే ఆ సినిమాలు భారీ షేర్ ను సాధిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు..

ఇటీవల వచ్చిన రాధే సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాను సల్మాన్ ఖాన్ చేయబోతున్నాడు. ఆయన అభిమానులంతా సల్మాన్ ఖాన్ ఏంటి ..? ఇలాంటి సినిమా చేయడం ఏంటి..? అంటూ అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. కానీ విమర్శకులను కూడా నోరు మూయించేలా వచ్చిన రాధే సినిమా కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా 3 వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుకే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ను ఎంచుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి..

ఈ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. అందుకే ఇప్పటివరకు మీడియం బడ్జెట్ తో వచ్చిన సల్మాన్ ఖాన్, ఏకంగా ఈ సినిమా కోసం 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కబోతుంటే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాడు అంటూ సినీ ప్రేక్షకులు కూడా చెబుతున్నారు.