మెగా అల్లుడు కిన్నెరసాని టీజర్ అదిరిపోయిందిగా.. మీరు చూశారా?

కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు. ఇతను విజేత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అయితే కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం కిన్నెరసాని అనే సినిమాలో నటిస్తున్నారు . మిస్టరీ థ్రిల్లర్ కథ అంశంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు అతి సర్వత్ర వర్ణయత్ అనేది క్యాప్షన్. అయితే ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను తాజాగా హీరో నితిన్ విడుదల చేశారు.

అద్భుతం జరిగే ప్రతి చోట ఆపదలు ఉంటాయి, ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఓ లిమిట్ ఉంటుంది. అది దేశానికైనా ప్రేమకైనా అనే డైలాగ్ లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి ఈ టీజర్ ఆద్యంతం సస్పెన్షన్ ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు అశ్వద్ధామ ఫేమ్ రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అన్ శీతల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాకు మహతి సర్వ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది.

Share post:

Latest