`మా` ఎన్నిక‌ల బ‌రిలో మ‌రో న‌ట‌డు..వార్ వ‌న్ సైడేన‌ట‌!

గ‌త కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నిక‌ల వ్య‌వ‌హారం వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నికలు ఎప్పుడు అన్న విష‌యం ప‌క్క‌న పెడితే.. ఎన్న‌డూ లేని విధంగా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అధ్య‌క్ష ప‌ద‌వి కోసం బ‌రిలోకి దిగుతున్నారు. ఇప్ప‌టికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సివిఎల్ నరసింహారావు, జీవిత రాజ‌శేక‌ర్‌, హేమ రేసులో ఉన్నారు.

MAA Elections: Tough fight on Cards

అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లో మ‌రొక న‌టుడు వ‌చ్చి చేరాడు. తాజాగా ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా పోటీ చేయబోతన్నట్టు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ప్రకటించారు. పోటీ చేయ‌డ‌మే కాదు గెలిచి చూపిస్తాన‌ని, వార్ వ‌న్ సైడేన‌ని సవాల్ కూడా చేశారీయ‌న‌.

MAA Elections 2021: 'మా' అధ్యక్షుడి బరిలో ఐదుగురు సభ్యులు.. ఎవరి బలమెంత..  బలగమెంత..?

‘మా`లో 900 మంది సభ్యులున్నా కూడా..ఎన్నికలు జరిగినపుడు ఓటు వేయడానికి కేవలం 450 మంది మాత్రమే వస్తారని చెప్పాడు. అందులో 300కు పైగా ఓట్లు తనకే పడతాయని కాదంబరి కిరణ్ ధీమాగా చెప్తున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో తాను చెప్పడం లేదని ఎన్నిక జరిగిన తర్వాత ఆ విషయం మీరే ఒప్పుకుంటారని కాదంబరి కిరణ్ కామెంట్లు చేశారు. కాగా, పోటీలో ఇంత మంది ఉన్న ముఖ్యమైన పోటీ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంద‌ని బ‌లంగా టాక్ వినిపిస్తోంది.