మంత్రులపై జగన్ అసహనం?

పులిచింతల ప్రాజెక్టులో 16వ నెంబరు గేటు నీటి ఉధ్రుతికి కొట్టుకుపోవడం.. దాని స్థానంలో స్టాప్ లాక్ అమర్చడం లాంటివి జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారం కేబినెట్ మంత్రులకు తలనొప్పి అయి కూర్చుంది. సీఎం జగన్ మంత్రుల వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలో ఈ వ్యవహారంపై ఇష్టానుసారం విమర్శలు చేస్తుంటే.. మంత్రలు మాత్రం చూస్తూ ఉండిపోయారని, తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆయన కోపానికి అసలు కారణం. కనీసం టీడీపీ, బీజేపీలు చేస్తున్న విమర్శలను ఖండించడం కూడా లేదు.

- Advertisement -

ఇలా అయితే ప్రభుత్వం పరువేం కావాలి. ముఖ్యంగా ఇది ఈ ప్రభుత్వం తప్పు కాదు.. గత పాలకులు చేసిన నిర్వాకం వల్లే జరిగిందని గట్టిగా చెప్పలేకపోతున్నారని, దీంతో జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అభిప్రాయం. ఇద్దరు, ముగ్గరు మంత్రులను నేరుగా ఆయనే ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని, అందులో తమ పేర్లు గల్లంతవుతాయని కొందరు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే.. మాకేంటి అని సైలెంటుగా ఉన్నారని తెలిసింది. ఎవరి పదవి ఉంటుందో.. ఎవరికి ఉండదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అందుల్లే అందరూ సైలెంట్ మోడ్ లో ఉన్నారు. మంత్రివర్గ సహచరుల గురించి జగన్ వ్యక్తిగతంగా సర్వేలు చేయించారని, వారి పనితీరుపై ఇప్పటికే ఆయన ఓ అంచనాకు వచ్చారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Share post:

Popular