చరిత్ర సృష్టించిన హాకీ జట్టు..ఇండియా ఖాతాలో మ‌రో మెడ‌ల్‌!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఇండియాకు మ‌రో మెడ‌ల్ సాధించి.. చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగిన మ్యా‌చ్‌లో జర్మనీపై 5-4తో విజయం సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తాజా విష‌యంతో.. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం అందుకున్న‌ట్టు అయింది.

ఇక తొలి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోరులో.. భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ఆట తీరుతో జర్మనీ ఆటగాళ్లను చిత్తు చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో సమర్ జిత్ రెండు గోల్స్ సాధించి భాారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టోక్యోలో భారత జట్టు విజయం సాధించిన వెంటనే దేశంలో సంబరాలు మిన్నంటాయి.

చారిత్రక విజయాన్ని అందించిన మన్‌ప్రీత్ సింగ్ సేనపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా, హాకీలో కాంస్య పతకం గెలవడంతో ఇప్పటి వరకు మన దేశానికి మొత్తం నాలుగు పతకాలు వచ్చాయి. ఇందులో ఒక రజతం మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.

Share post:

Latest