ఇండియన్ టు సినిమా పై సంచలన కామెంట్స్ చేసిన కమల్ హాసన్ ..?

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సుమారుగా 25 సంవత్సరాల తర్వాత ఇండియన్ టు సినిమాను గ్రాండ్ గా మొదలుపెట్టారు. ఇందులో హీరో కమల్ హాసన్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. సినిమా మొదలు పెట్టిన మొదట్లో షూటింగ్ సమయంలో క్రేన్ యాక్సిడెంట్ అవడంతో, ఈ సినిమా మీద బాగా ఎఫెక్ట్ పడేలా చేసింది. ఇకపోతే ఈ సినిమా ఎప్పటికప్పుడు సమస్యలలో చిక్కుకోవడంతో శంకర్ ఈ సినిమాను వదిలేసి రామ్ చరణ్ తో సినిమా తీయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడు..

ఇది విన్న ప్రేక్షకులంతా ఇండియన్ టు సినిమా క్యాన్సిల్ అయినట్టేనా..? అని అనుకుంటూ ఉండగా, అలాంటి వారికి ఇండియన్ 2 లేటెస్ట్ అప్డేట్స్ గురించి కమల్ హాసన్ స్వయంగా నోరు విప్పారు. కమల్ హాసన్ మాట్లాడుతూ ..” ఇండియన్ టు సినిమా దాదాపుగా అరవై శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే మళ్లీ సెట్స్ మీదకు వెళ్తుంది. అంతేకాదు సినిమా మధ్య మధ్య లో జరుగుతున్న గొడవలను నేను తగ్గించుకుంటూ వస్తున్నాను.. ఎట్టకేలకు అతి త్వరలోనే షూటింగ్ ను కూడా మొదలుపెడతామని” చెప్పడంతో ప్రేక్షకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Popular