గోవా పాపతో మాస్ రాజా జాతర!

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రస్తుతుం ఖిలాడి అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకునేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీగా ఉండగా, ఈ సినిమాను పక్కా కమర్షియల్ అంశాలతో దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే రవితేజ తన నెక్ట్స్ మూవీని కూడా అనౌన్స్ చేశాడు.

- Advertisement -

దర్శకుడు శరత్ మండవ డైరెక్షన్‌లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో నటించేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. కాగా ఈ సినిమాలో ఓ మాస్ మసాలా సాంగ్ కోసం అందాల భామ ఇలియానా పేరును రికమెండ్ చేశాడట రవితేజ. ఆమెతో తనకున్న స్నేహం కారణంగా ఇలియానా పేరును ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం చెప్పుకొచ్చాడట. ఇక ఇల్లీ పాప కూడా రవితేజ సినిమాలో ఛాన్స్ అనగానే ఓకే చెప్పేసినట్లు ఫిలింనగర్ వర్గాల టాక్.

ఏదేమైనా తనతో హీరోయిన్‌గా చేసి సక్సెస్ అందుకున్న బ్యూటీ ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బంది పడుతుండటంతో ఆమెకు స్పెషల్ సాంగ్ ఆఫర్ ఇప్పించి తిరిగి ఆమెను ట్రాక్‌లోకి తీసుకొచ్చేందుకు రవితేజ ప్రయత్నించడం నిజంగా గ్రేట్ అంటున్నారు ఆయన అభిమానులు. ఇక ఈ సినిమాను కూడా అతి త్వరలో పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Share post:

Popular