ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా అంటున్న హీరోయిన్?

ప్రభాస్ ఈ పేరు కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అంటుంది. ప్రభాస్, టైగర్‌ ష్రాఫ్‌, కార్తీక్ ఆర్యన్ ఈ ముగ్గురి హీరోల విషయం లో కొన్ని ప్రశ్నలు వేయగా అందుకు ఆసక్తికర సమాధానాలు తెలిపింది. ఈ ముగ్గురు హీరోల లో ఎవరితో డేటింగ్ కి వెళ్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవరిని ప్లర్ట్ చేస్తారు అన్న ప్రశ్నలకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది.

ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని,టైగర్‌ ష్రాఫ్‌ తో డేటింగ్ కు వెళ్తానని, అలాగే కార్తీక్ ఆర్యన్ ను ప్లర్ట్ చేస్తారని తెలిపింది. ప్రస్తుతం కృతిసనన్,హీరో ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Share post:

Popular