హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ప్రకాష్ రాజ్.. ఆసక్తికరమైన ట్వీట్..!

టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ అంటే తన నటనకు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఒకానొక సమయంలో ఈ నటుడు లేకపోతే సినిమాలను సైతం నిలిపి వేసేవారు. కాని రాను రాను కొత్త వాళ్లు రావడం చేత ఈయనకు కొద్దిగా ప్రయారిటీ తగ్గిందని చెప్పవచ్చు. అయితే గత రెండు రోజుల నుంచి ప్రకాష్ రాజ్ కు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ డిస్ఛార్జ్ అయిన వెంటనే ట్విట్టర్ ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు. అదేమిటో చూద్దాం.

- Advertisement -

సినీ నటుడు ప్రకాష్ రాజ్ చెన్నైలో షూటింగ్ లో హీరో ధనుష్ తో కలిసి చేస్తూ ఉండగా అతని చేతికి ఫ్రాక్చర్ అయింది అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సర్జరీ కోసం హైదరాబాద్ కి వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక తన ఆరోగ్యం బాగానే ఉందని కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తాజాగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ప్రకాష్ రాజ్ తన పరిస్థితిని తెలియజేశాడు.

“ది డెవిల్ ఈస్ బ్యాక్”అంటూ సర్జరీ విజయవంతమైన తరువాత ఈ పోస్టులు పెట్టి ప్రకాష్ రాజ్ తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేశాడు. తన స్నేహితులు కూడా ధన్యవాదాలు తెలుపుకు వచ్చాడు. ఇక అంతే కాకుండా త్వరలోనే మరి షూటింగ్ కి వెళ్తాను అని చెప్పి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన హాస్పిటల్ లో ఉన్నటువంటి ఒక ఫోటోను షేర్ చేసి భుజానికి గాయమైన.. పిక్చర్ ను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి మరో సినిమాలో కూడా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తన అభిమానులకి ప్రకాష్ రాజ్ కి ఎలా గాయమైందని అనే విషయం పై అనుమానం తీరిందని చెప్పవచ్చు.

https://twitter.com/prakashraaj/status/1425433608798363651?s=20

Share post:

Popular