సిటీమార్ సినిమా రిలీజ్ అయ్యేది థియేటర్ లోనే!

తొలివలపు సినిమా తో హీరోగా కెరీర్ ని మొదలు పెట్టి ఆ తరువాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు. అంతేకాకుండా హీరోగానే కాకుండా విలన్ క్యారెక్టర్ లో కూడా నటించాడు. జయం, నిజం లాంటి సినిమాలలో విలన్ పాత్రకు గోపీచంద్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన చిత్రం సీటీమార్. ఈ సినిమాలో తమన్నా, అలాగే దిగంగనా సూర్యవన్షి హీరోయిన్ లుగా నటించారు.

ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. అయితే ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడడంతో, ఈ సినిమాను వచ్చే నెల థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో గోపీచంద్ ఆంధ్ర మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా కనిపించనున్నాడు. తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా, అలాగే జర్నలిస్టు పాత్రలో దిగంగనా సూర్యవన్షి నటిస్తోంది.

Share post:

Popular