గోపీచంద్ సినిమాలో మరొక స్టార్ హీరో..?

గోపీచంద్ యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తను మొదటగా సినిమాలో విలన్ గా నటించి, ఆ తరువాత హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో గోపీ చంద్ ను వరుస ఫ్లాపులు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు సరికొత్త మూవీలో ఒక స్టార్ హీరోతో కలిసి నటించబోతున్న ట్లు సమాచారం. ఆ విషయాలను చూద్దాం.

- Advertisement -

కెరియర్ మొదట్లో చిన్న హీరో గా సినీ జీవితాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోగా రాణించిన అతి తక్కువ మంది హీరోలలో.. హీరో రాజశేఖర్ కూడా ఒకరు. అలాగే ఒకవైపు యాక్షన్ హీరోగా, మరొకవైపు రొమాంటిక్ హీరోగా నటించి మంచి ప్రేక్షకాదరణ పొందాడు. ఇక అలాగే సినిమాలలో తనకంటూ తిరుగులేకుండా కొన్ని పవర్ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు రాజశేఖర్.

rajashekar - Telugu Bullet

ఇక ఈ మధ్య కాలంలోనే గరుడవేగ సినిమాతో మంచి హిట్ అందుకున్న రాజశేఖర్, ఆ తర్వాత కల్కి వంటి సినిమా తో మంచి గుర్తింపు పొందారు. ఇక కొంతమంది హీరోలు మొదట హీరోగా చేసి, తిరిగి విలన్ గా రెండవ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. ఇప్పుడు అలాంటి వారిలో హీరో రాజశేఖర్ కూడా విలన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా దర్శకుడు శ్రీవాస్. తన సినిమాలో విలన్ పాత్ర కోసం విలన్ సేకరణ కోసం రాజ శేఖర్ ను సంప్రదించినట్లు ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈయన లక్ష్యం, డిటెక్టర్ వంటి సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ శ్రీవాస్. ప్రస్తుతం ఆయన గోపీచంద్ తో ఒక సినిమా నిర్మించబోతున్నట్లు సమాచారం . ఈ సినిమాలో విలన్ గా నటించేందుకు రాజశేఖర్ అని అడిగారని తెలుస్తున్నది. ఇక ఈ సినిమాకి రాజశేఖర్ ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తున్నది. అయితే ఈ విషయం నిజమో..?కాదో..? తెలియాలంటే కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

Share post:

Popular