గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రుల స‌మీక్ష‌…!

వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో గ‌ణేష్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై తెలంగాణ ఎంపీలైన ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌ల్లారెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ అత్యున్నత సమీక్ష సమావేశం మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది. ఈ మీటింగ్ లో రాష్ట్ర ప్ర‌భుత్వ చీఫ్ సెక్రెట‌రీ సోమేష్ కుమార్‌, డీజీపీ మహేంద‌ర్‌రెడ్డి, న‌గ‌ర మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మిలతో పాటు వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొని గణేష్ ఉత్సవాల నిర్వహణ అంశంపై చర్చించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గ‌ణేష్ ఉత్స‌వాలు స‌జావుగా సాగేందుకు పాటించాల్సిన చర్యల గురించి చర్చించారు. అలాగే మంత్రులు, అధికారులు గణేష్ ఉత్సవాల నిర్వహణలో అనుస‌రించాల్సిన వ్యూహం గురించి డిస్కస్ చేశారు.

ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మంత్రులు గణేష్ ఉత్సవాల గురించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన సమయం నుంచి అన్ని మతాల పండుగలను ప్రజలందరూ కలిసిమెలిసి జరుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గణేష్ ఉత్సవాలు కూడా శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణానికి హాని తలపెట్టని మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని సూచించారు.

Share post:

Popular