`ఫ్రెండ్‌షిప్ డే` గురించి ఈ ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా?

ఈ ప్ర‌పంచంలో అత్యంత గొప్ప బంధం ఏదైనా ఉందా అంటే అది స్నేహ‌బంధ‌మే. క‌న్న త‌ల్లిదండ్రులు, రక్తం పంచుకున్న తోబుట్టువులు, బంధువులు తోడు ఉంటారో లేదో తెలియ‌దు గానీ.. స్నేహితుడు మాత్రం ఎప్పుడూ మ‌న‌తోనే ఉంటాడు. సుఖాల్లోనే కాదు క‌ష్టాల్లోనూ అండ‌గా నిలుస్తాడు. అందుకే నిజమైన స్నేహితుడు ఒక్కడున్నా.. జీవితం ఎంతో అద్భ‌తంగా, అందంగా ఉంటుంది. ఇక ఎల్లలు లేని స్నేహానికి గుర్తుగా ప్ర‌తి ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్‌షిప్ డే గా సెల‌బ్రేట్ చేసుకుంటారు.

15 Pictures to take w/dylan ideas in 2021 | friends photography, boy and  girl best friends, best friend photos

అయితే అస‌లు ఫ్రెండ్‌షిప్ డే ఎప్పుడు మొద‌లైంది..? ఎలా మొద‌లైంది..? దీని వెన‌క ఉన్న చ‌రిత్ర ఏంటీ..? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1935 సంవత్సరంలో ఆగస్టు మొదటి శనివారం రోజున అమెరికాకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల కాల్పుల్లో మృతి చెందుతాడు. స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేని అతడి స్నేహితుడు.. శనివారం త‌ర్వాత రోజైన‌ ఆదివారం రోజున ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘ‌ట‌న‌కు చలించిపోయిన అమెరికా ప్రభుత్వం 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది.

Happy Friendship Day 2021: Wishes, quotes, messages, HD images, wallpapers,  WhatsApp & Facebook status for your friends | Lifestyle News – India TV

అయితే, జులై 30,1958న ఫ్రెండ్‌షిప్‌ ప్రతిపాదన తెర పైకి వచ్చింది. హాల్‌మార్క్‌ గ్రీటింగ్‌ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్‌ హాల్‌ ఏటా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత 1958లో పరాగ్వేలో వరల్డ్‌ ఫ్రెండ్‌షిప్‌ క్రూసేడ్‌ అనే సంస్థ జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది. దాంతో చాలా దేశాలు దీన్ని పాటించడం మొదలుపెట్టాయి.

Happy Friendship Day 2020 Wishes, Quotes in Hindi, English: Whatsapp  Status, Facebook messages, Images, HD wallpapers to wish your Girlfriend,  Boyfriend, Husband, Wife - NewsX

ఇక ఎట్టకేలకు..27 ఏప్రిల్,2011న ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే తేదీని జూలై 30గా గుర్తించింది. కానీ, భారత్, బంగ్లాదేశ్, మలేషియా, యూఎస్ వంటి చాలా దేశాల్లో ఆగస్టు మొదటి ఆదివారమే ఫ్రెండ్‌షిప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు.