నకిలీ కంటెంట్ పై ఫొకస్.. ఆ వీడియోలు పెట్టేవారికి హెచ్చరిక..?

తాలిబన్ల అరాచకాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఆప్గనిస్తాన్ ను వశపరుచుకుని ఎన్నో అల్లర్లను తాలిబన్లు రేపుతున్నారు. వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో ప్రత్యక్షమవుతున్నాయి. ఇటువంటి సమయంలో తాలిబర్లు బుర్ఖాలో ఉండి ఆడవాళ్లను నడిరోడ్డు మీద వేలం వేస్తున్న వీడియో నెట్టింట తాలిబన్ పేరుతో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలోని ఘటన 2014లో జరిగింది. కుర్షీద్ నాయకులు ఇరాక్ లో ఐసిస్ ఆగడాలను ఎండగడుతూ లండన్ లో ఈ నాటకం వేశారు.

ప్రస్తుతం ఈ వీడియో తాలిబన్ పేరుతో వైరల్ అవుతోంది. దీంతో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లు ఇటువంటి ఫేక్ వీడియోల అడ్డుకట్టకు చర్యలు తీసుకుంటోంది. తమ ప్లాట్ ఫామ్ లో ఇటువంటి వీడియోలను కనుక పోస్టు చేస్తున్నట్టయితే కచ్చితంగా నోట్ పెట్టాలని, అందులో వీడియో ఏ కాలం నాటిదో స్పష్టంగా ఉండాలని తెలిపాయి. ఇకపోతే ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లు నకిలీ కంటెంట్ ను తొలగించే పనిలో పడ్డాయి. యూజర్లకు హెచ్చరికలను జారీ చేస్తున్నాయి.