అల్లు అర్జున్ ని కావాలనే మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందా.. నిజమేంటి?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి, అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ మేనత్తను చిరంజీవి వివాహం చేసుకోవడంతో వీరిద్దరి కుటుంబాలు మరింత దగ్గరయ్యాయి. అంతేకాకుండా ఈ రెండు కుటుంబాలలో ఏ ఒక్క చిన్న ఫంక్షన్ జరిగినా కూడా అందరూ కలిసి మెలిసి ఆ ఫంక్షన్ లో ఆడి పాడి ఎంతో సందడి చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అలాంటి మెగాస్టార్ ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

lau

ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీలో అలాగే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా చిరంజీవి బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ ఒక్క అల్లు అర్జున్ మాత్రం చిరంజీవి కి బర్త్ డే విషెస్ చెప్పలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన అల్లు అర్జున్ అభిమానులు పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంవల్ల తన మామ కి విష్ చేయలేదు ఏమో అంటుండగా, మామ పుట్టినరోజు కూడా అంత బిజీ అయిపోయాడ అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల రక్షాబంధన్ వేడుకలకు అల్లుఅర్జున్ హాజరు కాకపోవడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. అయితే మొత్తానికి ఇంతవరకూ అల్లు అర్జున్ చిరంజీవి బర్త్ డే విషెస్ చెప్పారా లేదా అన్న విషయం తెలియలేదు.