దళితులను ఆ మాట అన్న నటి..

August 9, 2021 at 4:17 pm

ప్రస్తుతం ఎప్పుడూ తన పేరునే ప్రేక్షకులు అనుకోవాలని ఉద్దేశంతోనే ఒక హీరోయిన్ సాధారణంగా ఇతర స్టార్స్ ను కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఆమె పరిధులు దాటి టాలెంట్ కు పెద్ద పీట వేసే ఇండస్ట్రీ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నది. ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా..?ఆమె ఎవరో కాదు కోలీవుడ్ కు చెందిన మీరా మిధున్.

వెనుకబడిన కులాలకు చెందిన దర్శకులు, నటుల వల్లనే సినీ ఇండస్ట్రీకి ఇంతటి మంచి సినిమాలు రావడం లేదని, వారిని సినీ ఇండస్ట్రీ నుంచి బయటికి పంపిస్తే, అప్పుడు సినీ ఇండస్ట్రీ బాగుపడుతుందని ఆమె అనడంతో ఆ మాట వైరల్ గా మారింది.

పబ్లిసిటీ కోసం తన ఫోటోను పర్మిషన్ లేకుండా వాడుకోవడాన్ని తప్పు పట్టిన మీరా మిధున్.. చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా దుమారం రేపాయి. ఈ వార్తలన్నీ కేవలం ఒక ఇద్దరు ద్వారా అని తెలిపింది. ఇది కేవలం షెడ్యూల్డ్ కులాలు వారు సినిమాలు తీయడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆమె స్వయంగా ఇంటర్వ్యూలో తెలిపింది.

షెడ్యూల్డ్ కులాల వాళ్లకు అనేక నేరాలకు సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పడంతో దళిత సంఘాలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం పరుస్తున్నాయి. అంతేకాకుండా ఆమెపై కేసు కూడా ఫైల్ చేసినట్లు తెలుస్తున్నది. అయితే ఇలాంటివి అనడం కొంతమంది తప్పు అని తెలుపుతున్నారు. కానీ మరికొందరు ఈమె ఎంత అనుభవించి వుంటే అలా అంటుంది అని కూడా తెలుపుతున్నారు. ఏది ఏమైనా మీరా ఇలా అనకుండా ఉండాల్సింది అని మరి కొంతమంది అంటున్నారు.

దళితులను ఆ మాట అన్న నటి..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts