చిరంజీవికి మెగాస్టార్ అని బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీకి ఇటువంటి అండాదండ లు లేకుండానే స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుసినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు. అయితే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మెగాస్టార్ అన్న బిరుదు నే ఎవరు ఇచ్చారు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం.. అప్పట్లో స్టార్ హీరో గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న చిరంజీవి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ తో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు.

చిరంజీవి ని మెగాస్టార్ చిరంజీవి గా చేసింది నిర్మాత కె ఎస్ రామారావు. ఈయన దర్శకత్వంలో చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అప్పట్లో ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు అలాంటి అగ్రహీరోల తర్వాత స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన వ్యక్తి చిరంజీవి. అగ్ర హీరోలు ఉన్న సమయంలోనే చిరంజీవితో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు కెఎస్ రామారావు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం అభిలాష సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన చాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం, ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక మరణ మృదంగం సినిమా ద్వారా చిరంజీవికి తొలిసారిగా స్క్రీన్ పై మెగాస్టార్ అన్న బిరుదు వచ్చింది. ఇలా కె.ఎస్.రామారావు చిరంజీవికి మెగాస్టార్ బిరుదును అందించారు అని చెప్పవచ్చు. అలాగే ప్రస్తుతం చిరు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ గా మారడం వెనుక కూడా అసలు వ్యక్తి ఆయననే.