చిరు న్యూ లుక్స్ అదుర్స్..ఫ్యాన్స్ ఫిదా..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయనంటే ఓ చరిత్ర. తనంతట తానుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకుని ఈ రోజు ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద దిక్కుగా నిలిచారు. తన కుటుంబం నుంచి పదుల సంఖ్యలో హీరోలు వచ్చినప్పటికీ తాను వారితో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు.

దాసరి నారాయణ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా తన సేవను అందిస్తున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాను చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదలకానుంది. ఆ సినిమా తర్వాత మోహన్ రాజా డైరెక్షన్ లో లూసీఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు.

ఆ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు ఒక్కో గెటప్ తో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు లుక్ ను చూసి చాలా మంది ఫిదా అవుతున్నారు.

Share post:

Latest