హీరోలంద‌రూ ఫారిన్ వెళ్తుంటే..చిరు వైజాగ్‌ వెళ్తున్నాడేంటీ?

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత లూసీఫ‌ర్ రీమేక్‌, ఆ వెంట‌నే వేదాళం రీమేక్‌.. అనంత‌రం యంగ్ డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌ను లైన్‌లో పెట్టిన చిరు.. తాజాగా వైజాగ్‌కు వెళ్లార‌న్న వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

- Advertisement -

ఇంత‌కీ చిరు ఉన్న‌ట్టు ఉండి వైజాగ్‌కు వెళ్ల‌డానికి కార‌ణం.. ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ కోసమ‌ని తెలుస్తోంది. డీటాక్సిఫికేష‌న్, రెజువెనేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా వైజాగ్ లోని ఆయుర్వేదిక్ స్పా సెంట‌ర్‌కు చిరు వెళ్లార‌ని తెలుస్తోంది. అయితే నిజానికి టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రూ ఈ డీటాక్సిఫికేష‌న్ ప్రాసెస్ కోసం ఫారిన్ వెళ్తుంటారు.

కానీ, చిరు ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఫారిన్ వెళ్లే ప‌ని పెట్టుకోకుండా వైజాగ్ ను ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. కాగా, చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న ఆచార్య ష‌టింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషించ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక త్వ‌ర‌లోనే ఈ మూవీ విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌నుంది.

Share post:

Popular