ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య‌పై భ‌ర్త ఘాతుకం..అర్థ‌రాత్రి నిద్రిస్తుండ‌గా..?

August 10, 2021 at 9:29 am

ప్రేమించి వ్య‌క్తి కోసం క‌న్న వాళ్ల‌ను వ‌దిలేసి వ‌చ్చిందో యువ‌తి. కోరుకున్న‌ట్టుగానే ప్రియుడిని పెళ్లి చేసుకుని ఎన్నో ఆశ‌ల‌తో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. కానీ, చివ‌ర‌కు ప్రేమించిన భ‌ర్తే ఆమె పాలిట యమ పాశంగా మారి ప్రాణాల‌ను హ‌రించాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే..యూపీలో దుర్గేష్ యాదవ్ అనే యువకుడు, దీపిక అనే యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాల‌నుకున్న ఈ జంట‌.. విష‌యం ఇంట్లో చెప్ప‌గా వారు అందుకు నిరాక‌రించారు.

Husband, Wife, Fight, Eggs, Lover – aTrendHub

దాంతో దీపిక క‌న్న వాళ్ల‌ను వ‌దిలేసి దుర్గేష్‌తో వెళ్లిపోయి.. అత‌డిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లైన మొద‌ట్లో దుర్గేష్ ప్రేమగా ఉన్నట్టే కనిపించినప్పటికీ రానురానూ రాక్షసుడిగా మారాడు. మూడు నెల‌ల గ‌డ‌వ‌క ముందే.. దీపిక‌పై అస‌హ్యం పెంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే అర్థ‌రాత్రి దీపిక నిద్రిస్తున్న సమయంలో ఆమెపై కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు. భర్త దాడిలో గాయపడిన దీపిక తప్పించుకునేందుకు ప్రయత్నించిగా.. ఇనుప రాడ్‌తో గ‌ట్టిగా ఆమెను కొట్టాడు.

79 Murder Cases A Day Recorded In India In 2019, Shows National Crime  Records Bureau Data

దాంతో అక్క‌డిక‌క్క‌డే దీపిక ప్రాణాలు విడిచింది. ఆ వెంట‌నే దుర్గేష్ ఇంట్లో నుంచి ప‌రార్ అయ్యాడు. అయితే ఆ త‌ర్వాతి రోజు దీపిక సోద‌రుడు బచ్చూలాల్.. అక్క‌ను చూసేందుకు ఇంటికి వ‌చ్చాడు. కానీ, అప్ప‌టికే దీపికా రక్తపు మడుగులో విగతజీవిగా ప‌డి ఉంది. అది చూసిన బ‌చ్చూలాల్ తీవ్ర వేద‌న‌కు గురై.. వెంట‌నే పోలీసుల‌కు, కుటుంబ‌స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. ఇక కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దీపిక మ‌ర‌ణానికి భ‌ర్తే కార‌ణ‌మ‌ని నిర్ధారణకు వ‌చ్చి.. ప‌రారీలో ఉన్న అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య‌పై భ‌ర్త ఘాతుకం..అర్థ‌రాత్రి నిద్రిస్తుండ‌గా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts