భార్యకు ఇచ్చిన మాట కోసం కట్టుబడిన చలపతిరావు..

వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన చలపతిరావు..వయసు పెరిగే కొద్దీ అడపదడప పాత్రలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు.. ఇక ఒకానొక ఇంటర్వ్యూలో తనది అరేంజ్డ్ మ్యారేజ్ కాదని తెలియజేశాడు. ఇక అంతే కాకుండా నందమూరి తారకరామారావు దగ్గరికి వెళ్లి మా ఆయనకు ఎందుకు మంచి వేషాలు ఇవ్వడం లేదంటూ చలపతిరావు భార్య నిలదీసిందంట.

ఒక నాటకంలో హీరోయిన్ దొరకకపోతే తన భార్య వేసిందని చెప్పుకొచ్చాడు చలపతిరావు. ఇక అంతే కాకుండా సినిమాలలోకి వచ్చేందుకు ఎంతగానో ప్రోత్సహించారని వెల్లడించారు. తన భార్యకు ఇచ్చిన మాట ప్రకారం తను ఏ వ్యసనాలకు బానిస కాకుండా చాలా జాగ్రత్తగా ఉండేవాడని తెలియజేశాడు చలపతిరావు.

కేవలం ఒక వారం లోనే చూసుకొని వారిద్దరూ లవ్ చేసుకున్నట్లు , తన ఫ్రెండ్స్ కు తెలియజేయడంతో బెజవాడలోని కళ్యాణ మండపం వెళ్లి పెళ్లి చేసుకున్నామని వెల్లడించారు. తను మాత్రం పిల్లలను బాగా చదివించాలని అనుకొని, వారిని అదేవిధంగా చదివించానని చలపతిరావు తెలిపారు. కానీ అనుకోని పరిస్థితుల్లో తన భార్య మరణించిందట. ఇక ఆయన ఇద్దరమ్మాయిలు అమెరికాలో ఉన్నట్లు సమాచారం.

కానీ తనకు రెండో పెళ్లి ఆలోచన రాలేదని చలపతి రావు వెల్లడించారు.తారక రామారావు పెళ్లి చేసుకోమని చెప్పారని, పిల్లలను చదివించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాను అని చలపతిరావు వెల్లడించారు. తన పిల్లలిద్దరూ బాగా చదువుకొని మెరిట్ ద్వారానే సీట్ సంపాదించారని వెల్లడించారు. వారికి కేవలం నేను చదువుకోమని మాత్రమే చెప్పాను అని తెలియజేశాడు. తన భార్య ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ నేను వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నానని తెలియజేశాడు.

ఇక తన కొడుకు హీరో డైరెక్టర్ అయిన రవి బాబు కూడా ఇప్పటివరకు బీరు కూడా తాగడాన్ని తెలియచెప్పాడు. హీరోగా ప్రయత్నాలు చేయలేదని తన కొడుకు కూడా హీరో అవ్వాలని అనుకోలేదు అని వెల్లడించారు.