అత్యధిక ధర కి పలికిన భీమ్లా నాయక్ ఓటీటీ రైడ్స్..?

సినీ ఇండస్ట్రీల పవన్ కళ్యాణ్ అంటే ఎంతమంది అభిమానులున్నారో మనందరికీ తెలిసిన విషయమే.ఇక స్క్రీన్పై పై పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు, ఎంతో మంది అభిమానులు సంబరపడిపోతూ ఉంటారు.ఇక అంతలా ఉంటుంది ఈయన రేంజ్.ఇక ఆ రేంజ్ కు తగ్గట్టుగానే ఈయన సినిమా బిజినెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అలా తాజాగా భిమ్లా నాయక్ సినిమాలో కూడా అదే విషయం జరిగింది.

ప్రస్తుతం ఇంకా షూటింగ్ దశలో ఉండగానే, ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ మొదలైనట్లు సమాచారం.అయితే ఈ సినిమాకు సంబంధించి ఓటిటి అమెజాన్ ప్రైమ్ పెద్ద మొత్తంలో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి ముఖ్యకారణం ఈ సినిమాలో నటిస్తున్న రానా,పవన్ కళ్యాణ్ కారణమని చెప్పవచ్చు.

Amazon Prime Tops 150 Million Members - Variety

ఈ సినిమా మలయాళం నుంచి రీమిక్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా ఆత్మగౌరవానికి, ఆహానికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ అన్నట్లుగా వినిపిస్తోంది.ఇక ఈ సినిమాలో బిజు మీనన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.ఇక తమిళంలో అయితే ఈ సినిమాకు సంబంధించి ఇద్దరి హీరోలకు న్యాయం జరిగిందట.కానీ తెలుగులోకి వస్తే ఎక్కువగా పవన్ కళ్యాణ్ కే ప్రాధాన్యత ఇవ్వడంతో.. దగ్గుబాటి రానా అభిమానులు తమ హీరో కి అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో ఎక్కువగా కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest