చీర కట్టులో అనుపమ అందాలు…!

ప్రపంచంలో ఎక్కడా లేని కట్టు, బొట్టు భారతదేశం సొంతం. కాగా, దానితో ప్రత్యేకమైన గుర్తింపు భారతదేశానికి లభించింది. చీరకట్టుతో ఉన్న భారతీయ మహిళలను చూసి విదేశీయులు ఆశ్చర్యపోతుండటం మనం చూడొచ్చు. ఇకపోతే ప్రస్తుత తరం హీరోయిన్స్ ఆధునిక పద్ధతిలో వస్త్రధారణకే ప్రయారిటీ ఇస్తుండగా, కొద్ది మంది మాత్రమే చీరలో కనిపించేందుకు ఇష్టపడుతుంటారు.

అందులో ఒకరు మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ప్రేమమ్’తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె ఆకుపచ్చ చీరలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అది చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. ఆ ఫొటోల్లో సంప్రదాయ సౌరభం వెల్లివిరుస్తున్నదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ భామ ఇటీవల కాలంలో ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించగా, యూట్యూబ్‌లో అది సంచలనమే సృష్టించింది. తెలుగులో ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తున్న ‘18 పేజెస్’ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

Share post:

Latest