`పుష్ప‌` నుంచి లీకైన అన‌సూయ లుక్‌..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా.. ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మొద‌టి భాగం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల కానుంది.

పుష్పలో అనసూయ పిక్ లీక్.. చూసి షాక్ అవ్వాల్సిందే..

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈమె షూటింగ్‌లో కూడా పాల్గొంటోంది. అయితే తాజాగా పుష్ప నుంచి అన‌సూయ లుక్ ఒక‌టి లీకైంది. షార్ట్ హెయిర్‌‌, నుదిటిన పెద్ద బొట్టుతో చాలా డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్న అన‌సూయ‌ను చూస్తే న‌వ్వాగ‌దు.

పుష్ప' ఫోటోలు లీక్‌.. ఆసక్తికరంగా అనసూయ గెటప్ | NTV

ఈ క్ర‌మంలోనే అన‌సూయ లుక్‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు మీమ్స్ త‌యారు చేసి ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి అన‌సూయ లుక్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా, ఈ చిత్రంలో సునీల్ భార్యగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అన‌సూయ క‌నిపించ‌బోతోంద‌ని టాక్ న‌డుస్తోంది.

Anasuya Look From Pushpa Movie Leaked Photo Goes Viral - Sakshi

Share post:

Latest