కేజ్రీవాల్‌ సోనూసూద్ ను అందుకే కలిశాడా?

సోనూసూద్ కరోనా మహమ్మారి సమయంలో చేసిన సామాజిక సేవతో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సోనూసూద్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా, లేదా అప్పుడే చెప్పలేము. అయితే సోనూసూద్ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఒక వేదికపై కనిపించడంతో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ వేదిక పై సోనూసూద్‌ ను దేశ్ కే మెంటర్ అనే ఒక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారని ప్రకటించారు. ఆ కార్యక్రమం ద్వారా స్కూలు పిల్లలకు భవిష్యత్ గురించి మార్గనిర్దేశం చేస్తారు. దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మధ్య నుంచి ప్రారంభించనుంది.ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన సోనూసూద్ తనకు రాజకీయాల్లోకి రావాలని ఉద్దేశం లేదని అలాగే తను బ్రాండ్ అంబాసిడర్ కావడానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.

ఈ కార్యక్రమం అరవింద్ కేజ్రీవాల్‌కు కచ్చితంగా రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని ఆయనకు తెలిసే ఉంటుంది.మీరు సోనూసూద్‌తో రాజకీయాలపై కూడా చర్చించారా అని ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మీడియా అడిగినపుడు, ఆయన లేదు లేదు మా మధ్య ఎలాంటి రాజకీయ చర్చలూ జరగలేదు అని తెలిపారు.పిల్లల భవిష్యత్తు అనేది రాజకీయాల కంటే పెద్ద అంశం. చాలా కాలం నుంచీ రాజకీయాల్లో అడుగుపెట్టడానికి నాకు అవకాశాలు వస్తున్నాయి. కానీ, నాకు వాటిపై ఆసక్తి లేదు. నాకు అలాంటి ఉద్దేశమేదీ లేదు. ఈ కార్యక్రమం ఆలోచన మంచిది. దీనివల్ల కచ్చితంగా విద్యార్థులకు ఒక దిశానిర్దేశం లభిస్తుంది అని సోనూ సూద్ కూడా చెప్పారు.