అర్హలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

బన్నీ గారాలపట్టి అల్లు అర్హ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటోంది. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తన చిన్నారి అల్లరి ఫొటోలు, వీడియోలను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో బన్నీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఇటీవల బన్నీ తన ముద్దుల తనయతో కలిసి బబుల్ లో కాసేపు సరదాగా గడిపారు. కాగా స్నేహ ఈ వీడియో తన ఇన్‌స్టాలో షేర్ చేసి ఫ్యాన్స్ ని అలరించారు. తాజాగా ఆమె మరొక ఇన్‌స్టా పోస్ట్ పెట్టి బన్నీ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టులో అల్లు అర్హ మట్టితో ఓ తాబేలు బొమ్మను తయారు చేసినట్లు చూడొచ్చు. ఆ మట్టి బొమ్మను చాలా చక్కగా తయారు చేయడంతో అర్హని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. అర్హలో నటనా టాలెంటుతో పాటు ఈ కళాత్మక టాలెంట్ కూడా ఉందా? అని బన్నీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్హ గుణశేఖర్ రూపొందిస్తున్న శాకుంతలం మూవీతో వెండితెరకు పరిచయం కానుంది. భ‌ర‌తుడి పాత్రలో మెరవనున్న ఈ చిన్నారి.. 20 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న‌ట్టు సమాచారం.

Share post:

Latest