అల్లువారి రక్షాబంధన్ సెలెబ్రేషన్స్.. ఫొటోస్ వైరల్..!

ఇవాళ దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెళ్లు తమ ప్రియమైన అన్నదమ్ములకు రాఖీ కట్టి తమ బంధాన్ని బలపరుచుకుంటున్నారు. ‘రక్షాబంధన్’ పండుగ అనేది సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర దినాన సినీ సెలబ్రిటీలు సైతం తమ తోబుట్టువులతో కలిసి ఘనంగా రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటున్నారు.

అల్లు వారి ఇంట కూడా రాఖీ వేడుకలు అంబరాన్ని అంటాయి. అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ.. తన అన్నయ్య అయాన్ కు రాఖీ కట్టి పండుగ జరుపుకుంది. కాగా వారి రాఖీ వేడుకులకు సంబంధించి కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇక అల్లు అర్హ అతిచిన్న వయసులోనే వెండితెరపై అరంగేట్రం చేయడానికి సిద్ధమైంది. దర్శకుడు గుణశేఖర్, కథానాయక సమంత కాంబోలో తెరకెక్కనున్న ‘శాకుంతలం’లో అర్హ ప్రిన్స్ భరత్ అనే పాత్రలో నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest