హీరో రామ్ తో బోయపాటి సినిమా.. ఈసారి మాములుగా ఉండదు?

టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తరువాత తమిళ డైరెక్టర్ లింగుస్వామి తో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో ఉస్తాద్ అనే సినిమాను చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణ తో కలిసి అఖండ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే రామ్ పోతినేని తో కలిసి సినిమాలు తీయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంపై అధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది. అఖండ తర్వాత బోయపాటి అల్లు అర్జున్ సినిమాలు చేయాల్సి ఉండగా, బన్నీ పుష్ప, ఐకాన్ ఇలాంటివి వరుస మూవీలతో బిజీగా ఉండడం వల్ల, బన్నీ కోసం బోయపాటి వెయిట్ చేసే పరిస్థితుల్లోనూ లేడు. అందుకోసమే అల్లుఅర్జున్ కోసం వెయిట్ చేయకుండా హీరో రామ్ కి కథ చెప్పాడట బోయపాటి. ఈ సినిమాను అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.

Share post:

Popular