గుర్రపు స్వారీతో సందడి చేస్తున్న అఖిల్ ..?

అక్కినేని కుటుంబం నుంచి ఏ సినిమా వచ్చినా కూడా దానికొక క్రేజ్ క్రియేట్ అవుతుంది. అయితే అక్కినేని కుటుంబంలో అఖిల్ కు మాత్రం ఇప్పటి వరకూ ఏ సక్సెస్ రాలేదు. ఈసారి చేసే సినిమా కచ్చితంగా ఓ సూపర్ డూపర్ హిట్ ఇవ్వనుంది. తాజాగా అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ తన బాడీ రూపు రేఖల్ని మార్చుకున్నారు.

మొత్తం డిఫరెంట్ లుక్ తో డిఫరెంట్ స్టైల్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో భాగంగా అక్కినేని అఖిల్ గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతున్నాయి. గుర్రంపై అఖిల్ వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు వక్కంతం వంశీ స్టోరీని ఇచ్చారు. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందు రానుంది.

Share post:

Latest