ఆదిపురుష్ సాంగ్ విజువల్స్ అదుర్స్..!

హిందూ శాస్త్రంలో అత్యంత ప్రావీణ్యం పొందిన రామాయణం కథను ఆధారంగా తీసుకొని కొన్ని మార్పులు చేసి ఆదిపురుష్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోంది. ఇక రావణుడి పాత్ర లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ను ఎంచుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ అలాగే కృతిసనన్ , సైఫ్ అలీఖాన్ ఒక సన్నివేశంలో ముగ్గురు కలిసి నటిస్తుండగా, ఆ సన్నివేశం బయటకు రాగా ప్రస్తుతం ఈ సన్నివేశం బాగా హైలెట్ గా మారింది.

విజువల్స్ చాలా బాగున్నాయి అంటూ నెటిజనులు కామెంట్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు వారు ప్రాక్టీస్ చేస్తున్న ఒక పాట బయటకి రాగా ఇది కూడా చాలా బాగుంది అంటూ సినీ ప్రేక్షకులు తెగ సంబరపడిపోతున్నారు. దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి పాట చిత్రీకరణ బయటకు రావడంతో ప్రస్తుతం హైలెట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా పూర్తిగా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూడడానికి ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ రెండు విజువల్స్ బయటికి రావడం వల్ల ప్రేక్షకులలో ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి అని చెప్పవచ్చు.