కేక‌పెట్టిస్తున్న స్నేహ లేటెస్ట్ లుక్స్‌..చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

స్నేహ‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స్నేహ‌.. ఆ త‌ర్వాత‌ టాలీవుడ్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు ఆమ‌డ దూరంగా ఉండే ఈ అమ్మ‌డు.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను చ‌క్క‌గా మెప్పించ‌గ‌లిగింది.

ఇక తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ న‌టించిన స్నేహ‌.. కెరీర్ పిక్స్‌లో ఉన్న‌ప్పుడే నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ దంప‌తుల‌కు ఒక బాబు, పాప ఉన్నారు. పెళ్లి త‌ర్వాత కొన్నేళ్లు సినిమాల‌కు దూర‌మైన‌ స్నేహ మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స‌హాక పాత్ర‌ల్లో న‌టిస్తోంది.

అలాగే ప‌లు యాడ్స్‌ను సైతం చేస్తోంది. అయితే పెళ్లి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా స్పేహ అందం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. అభిమానులు, నెటిజ‌న్లు కూడా ఇదే చెబుతుంటారు. ఇక ఇదే విష‌యాన్ని స్నేహ తాజా పిక్స్ మ‌రోసారి ఫ్రూవ్ చేశాయి. నేడు ప్ర‌స‌న్న బ‌ర్త్‌డే కావ‌డంతో స్నేహ‌ సెల‌బ్రెష‌న్స్‌లో మునిగిపోయింది.

అంతేకాదు, అందుకు సంబంధించిన పిక్స్‌ను తాజాగా త‌న అభిమానుల‌తో పంచుకుంది. ఇక ఈ పిక్స్‌లో స్నేహ లుక్స్ చూస్తే కేక‌పెట్టాల్సిందే. అంత‌లా త‌న అందంతో ఆక‌ట్టుకుంటోంది ఈ హోమ్లీ బ్యూటీ. ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారిన స్నేహ లేటెస్ట్ పిక్స్‌కు ఫ్యాన్స్‌తో పాటు నెటిజ‌న్లు సైతం ఫిదా అయిపోతున్నారు.