హ‌న్సిక గొప్ప మ‌న‌సుకు నెటిజ‌న్లు ఫిదా..ఇంత‌కీ ఏం చేసిందంటే?

హన్సికా మోట్వాని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేశముదురు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకున్న హ‌న్సిక‌.. తెలుగులోనే కాకుండా హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించి స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

Indian Beautiful Actress Hansika Motwani Hot Photos | Actresses, Most  beautiful indian actress, Beautiful bollywood actress

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్న ఈ భామ‌.. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను అనాథ‌ల‌తో క‌లిసి జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సంద‌ర్భంగా హ‌న్సిక త‌న మంచి మ‌న‌సును చాటుకుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల్లో పది మందిని దత్తత తీసుకుని, వారి వైద్య ఖర్చులకు అయ్యే మొత్తాన్ని తానే భరిస్తానని ప్రకటించింది.

Pin on Hansika Motwani

ఈ పదిమంది చిన్నారులు క్యాన్స‌ర్ నుంచి పూర్తిగా కోలుకునేంత వరకు అయ్యే వైద్య ఖర్చులను చెల్లిస్తానని ఆమె వెల్లడించింది. దాంతో ఆమె గొప్ప మ‌న‌సుకు నెటిజ‌న్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆమెపై ప్రశంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.