బ్రేకింగ్: పారాలింపిక్స్ లో మరొక పతకం సొంతం చేసుకున్న భరత్…!

ఇప్పుడు పారాలింపిక్స్ ఆట‌లు ఎంత వైభ‌వంగా సాగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక ఈ ఆట‌ల్లో కూడా మ‌న ఆట‌గాళ్లు బాగానే స‌త్తా చాటుతున్నారు. కాగా ఇప్పుడు పారాలింపిక్స్ లో మరో గోల్డ్ మెడ‌ల్ భారత్ ఖాతాలో పడ‌టం విశేషం. అయితే ఒలంపిక్స్ మాదిరిగానే ఇప్పుడు జావెలిన్ త్రో ఎఫ్64 ఈవెంట్‌లో సుమిత్ ఆంటిల్ అద్భుతంగా ప్ర‌ద‌ర్శ‌న చేసి మ‌రీ ఈ గోల్డ్ మెడ‌ల్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు 68.55 మీటర్లు ఆయ‌న త‌న ఈటెను విసిరి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడంటే న‌మ్మండి

ఇక అంద‌రికంటే ఆయ‌న మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఇక దీంతో ఈ టోక్యో పారాఒలంపిక్స్ లో రెండు స్వర్ణ పతకాలు మ‌న ఇండియా సొంతం అయ్యాయి.ఇంకాచెప్పాలంటే ఈ పారాలింపిక్స్‌లో ఈ రోజు భారత క్రీడా చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం అనే చెప్పాలి. ఆ విజ‌యం ఎప్పటికీ గుర్తుండి పోతుంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దేమో. ఇక మ‌న భారత ప్రధాని నరేంద్ర మోడీ మన అథ్లెట్లు పారాలింపిక్స్‌లో అద్భుతమైన ఆట ప్రదర్శన కనబరుస్తున్నారని ట్వీట్ చేయ‌డం ఇప్ఉడు విశేషంగా మారింది. సుమిత్‌కు ఆయ‌న అభినందనలు తెలిపారు.

Share post:

Popular