చరణ్, తారక్ ‘దోస్తీ’ లేటెస్ట్ వీడియో.. ‘ఆర్ఆర్ఆర్’ క్రేజీ ప్రమోషన్స్..!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ షురూ అయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ నుంచి ఇటీవల విడుదలైన ‘దోస్తీ’ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ఉక్రెయిన్‌లో జరుగుతుండగా, మూవీ యూనిట్ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఇన్ స్టా వేదికగా ‘ఆన్ ద వే టు షూట్ విత్ మై దోస్త్’ అనే క్యాప్షన్‌తో వీడియో విడుదల చేశారు మేకర్స్. వీడియోలో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కారులో ‘దోస్తీ’ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ప్రయాణిస్తున్నారు.

ఈ క్రమంలోనే మీరు కూడా మీ స్నేహితులతో ఈ సాంగ్‌ని హ్యాపీ గా హమ్ చేసుకునే వీడియోలను పోస్ట్ చేయాలని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కోరింది. మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ వినూత్న ప్రమోషన్స్‌కు ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కాబోతున్న సంగతి అందరికీ విదితమే.