నటి హేమకు నరేష్ వార్నింగ్..?

టాలీవుడ్ లో గత కొంత కాలంగా రచ్చ రచ్చ జరుగుతోంది. మా అసోసియేషన్ లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పరంగా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ముందుగా లీడర్లు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణులు మాటల యుద్దం చేసుకున్నారు. ఆ తర్వాత పాత కమిటీలపై నిందారోపణలు వేడెక్కాయి.

మా అసోసియేషన్ లోని డబ్బును నరేష్ విపరీతంగా ఖర్చు పెట్టేశాడని నటి హేమ ఆరోపించింది. నటి హేమకు సంబంధించిన ఓ వాయిస్ టేప్ నెట్టింట హల్ చల్ చేసింది. మా అసోషియేషన్ లో ఉండే 5 కోట్ల డబ్బులో 3 కోట్లు నరేష్ ఇప్పటికే ఖర్చు పెట్టేశాడని హేమ ఆరోపించింది. ఆమె మాటలను నరేష్ ఖండించి ఆమెపై ఫైర్ అయ్యాడు. ఆమె క్రమ శిక్షణ లేకుండా ఇలా ఆరోపణలు చేయడంపై కమిటీ ఫిర్యాదు చేస్తామని నరేష్ ఆమె వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం మా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Share post:

Latest