లిక్కర్ షాప్ కి వెళ్లి అడ్డంగా దొరికిపోయిన అల్లుఅర్జున్..?

ఇటీవల కాలంలో ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో కి అడుగు పెడుతున్న యంగ్ హీరోలకే, సినీ ప్రేక్షకులలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటే, ఇక స్టార్ హీరోల పరిస్థితి ఏమిటి.. ?సినీ ఇండస్ట్రీ లో అత్యధికంగా అభిమానులను సంపాదించుకుని ,స్టార్ హీరోగా కొనసాగుతూ, తన అభిమానుల కోసం ఏదైనా చేయాలని, కొంత మంది స్టార్ హీరోలు తపన పడుతూ ఉంటారు. ఇలాంటి స్టార్ హీరోల కోసం అభిమానులు కూడా వారి పూర్తి విషయాలు తెలుసుకోవాలని తెగ ఆరాట పడుతూ ఉంటారు. అంతేకాదు తమ స్టార్ హీరోలు ఏమి చేస్తుంటారు..? వారు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు ..? వారి అలవాట్లు ఏమిటి..? వారు ఎక్కడికి వెళ్తారు..? వారు ఏ విషయాల పైన ఆసక్తి చూపుతారు ..?అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఉంటారు.

 

ఇకపోతే సోషల్ మీడియా ద్వారా హీరోలు ఏమేం చేస్తుంటారో.. అనే విషయాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు కూడా అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక సీసీ టీవీ ఫుటేజ్ ఫేస్ బుక్ ద్వారా విడుదలై, నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఆ సీసీ ఫుటేజ్ లో అల్లు అర్జున్ లిక్కర్ మార్ట్ లోకి ప్రవేశించి, తనకు కావలసి లిక్కర్ బాటిల్ ను కొనడం కూడా స్పష్టంగా చూడవచ్చు. అంతేకాదు లిక్కర్ మార్ట్ గోవాలో ఉందని ఈ ఫోటో షేర్ చేసిన వారు చెప్పడం గమనార్హం..

ఈ సీసీటీవీ ఫొటోస్ చూసిన కొంతమంది అల్లు అర్జున్ లుక్ ఇప్పటిది కాదు.. నాపేరు సూర్య సినిమా సమయంలో అల్లు అర్జున్ అలా ఉన్నాడు.. ఈ ఫోటో పాతది ..అని కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. ఇకపోతే మరికొంతమంది ఇక్కడి నిజంగా అల్లు అర్జునే ఉన్నాడా..? లేక అతని స్థానంలో అల్లు అర్జున్ లా ఉండే మరో వ్యక్తి ఎవరైనా ఉన్నారా ..? అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Share post:

Latest