మెగాస్టార్ చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్.. వీడియో వైరల్!

August 22, 2021 at 1:28 pm

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనేక సర్ ప్రైజ్‌లు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు మొత్తం నాలుగు మూవీల పోస్టర్లు, అప్డేట్స్ విడుదలయ్యాయి. చిరు సినిమా బృందం మహేష్ తో వేదాళం మూవీ రీమేక్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేయించి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మోహర్ రమేష్ రూపొందిస్తున్న సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేశారు.

ఈ క్రమంలోనే చిత్ర బృందం మరొక వీడియోని విడుదల చేసి వావ్ అనిపించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియోలో అగ్రతార కీర్తి సురేష్ చిరంజీవికి రాఖీ కడుతూ కనిపించారు. ‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి నటించనున్నారని ఈ వీడియోతో స్పష్టమైంది. కొంతకాలంగా ఈ ఛాలెంజింగ్ రోల్ లో ఎవరు నటిస్తున్నారనే విషయంపై పుకార్లు షికారు చేశాయి. ఎట్టకేలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా పూర్తి క్లారిటీ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అన్నా చెల్లెల అనుబంధం వెండితెరపై ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మెగాస్టార్ చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్.. వీడియో వైరల్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts