మూడేళ్లుగా వేధిస్తూనే ఉన్నారు..ప్రియా వారియర్ ఆవేద‌న‌!?

కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ ముద్దుగుమ్మ‌ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చెక్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తాజాగా తేజ స‌జ్జ హీరోగా తెర‌కెక్కిన ఇష్క్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

జూలై 30న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న‌ ప్రియా వారియ‌ర్.. సోష‌ల్ మీడియా వేదిక‌గా వేధింపుల‌కు గురిచేస్తున్న నెటిజ‌న్ల‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. గత మూడేళ్ళుగా ఏదో ఒక విష‌యంపై తాను సోషల్ మీడియా వేధింపులకు గురవుతూనే ఉన్నాన‌ని ప్రియా ఆవేద‌న‌ వ్య‌క్తం చేసింది.

అయితే ఇతరుల‌ కామెంట్స్ పట్టించుకుంటూ, మనల్ని మనం మార్చుకోవడం పొరపాటు. అందుకే నెటిజ‌న్ల‌ కామెంట్స్‌ను నేను సీరియస్ గా తీసుకోవడం మానేశాన‌ని.. కేవలం పాజిటివ్ విషయాలు తీసుకొని, నెగిటివ్ విషయాలు వదిలేస్తున్నాన‌ని ప్రియా వారియర్ చెప్పుకొచ్చింది. అలాగే ఇన్‌స్టాలో పోస్ట్ చేసే ప్రతి విషయంలో బాధ్యతగా ఉండాలని నేను అనుకోను, నాకు అనిపించిందే చెబుతాన‌ని పేర్కొంది.

Share post:

Popular