ఇంగ్లీష్ భాషలో అదరగొడుతున్న వృద్ధురాలు.. వీడియో వైరల్..

August 20, 2021 at 2:47 pm

మనిషి రూపాన్ని, వేషధారణను చూసి వారి సామర్థ్యాన్ని అంచనా వేయకూడదని పెద్దలు అంటుంటారు. సాదాసీదాగా కనిపించే వ్యక్తి గొప్పవాడు కావచ్చు.. గొప్పవాడిగా కనిపించే వ్యక్తి బుద్ధిహీనుడు కావచ్చు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. బీహార్‌లోని పాట్నాలో బిక్షాట‌న చేసే సన్నీ బాబా అనే ఒక వృద్ధుడు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడి హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఒక యాచకుడు ఇంగ్లీష్ మాట్లాడటం చూసి యావత్ భారతదేశం అవాక్కయింది. చిరిగిన బట్టలతో రోడ్ల వెంట తిరిగే యాచకులు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారా అని చాలామంది ముక్కున వేలేసుకున్నారు.

తాజాగా అచ్చం అదే టాలెంట్ తో మరొక టాలెంటెడ్ యాచకురాలు వెలుగులోకి వచ్చింది. భిక్షాటన చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ వృద్ధురాలు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఆశ్చర్యపరిచింది. ఆమెకు ఇంగ్లీష్ భాష పైన ఉన్న పట్టు గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. డిగ్రీ చదువుకున్నవారు కూడా ఆమె లాగా ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడలేరేమో అనిపిస్తుంది. ఆమెలోని టాలెంట్ ని ఓ స్థానిక ఛానల్ వారు గుర్తించారు. ఆమె టాలెంట్ ని అందరికీ పరిచయం చేశారు. దీంతో ఆమె వీడియో కూడా వైరల్ గా మారింది. మీరు ఒక లుక్కేయండి.

ఇంగ్లీష్ భాషలో అదరగొడుతున్న వృద్ధురాలు.. వీడియో వైరల్..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts