విజ‌య్ ద‌ళ‌ప‌తికే షాకిచ్చిన కార్తి..ఏం జ‌రిగిందంటే?

సాధార‌ణంగా సినిమాలోని పాత్ర‌ల బ‌ట్టీ.. హీరోలు త‌మ లుక్ ను ఛేంజ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి కొత్త‌ లుక్ కార‌ణంగా హీరోలను గుర్తుప‌ట్ట‌డం కూడా క‌ష్టం అవుతుంది. తాజాగా కార్తికి కూడా ఇలాంటి సంఘ‌ట‌నే ఎదురైంది. కార్తి ప్ర‌స్తుతం సర్దార్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని ఓ ప్రైవేట్‌ స్టూడియోలో జ‌రుగుతోంది.

అదే లొకేషన్‌కు సమీపంలో విజ‌య్ ద‌ళ‌ప‌తి హీరోగా తెర‌కెక్కుతున్న బీస్ట్ మూవీ షూటింగ్ కూడా జ‌రుగుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న కార్తి.. షూటింగ్ గ్యాప్‌లో సర్దార్‌ గెటప్‌లోనే బీస్ట్ సెట్స్‌కి విజ‌య్‌ను క‌లిసేందుకు వెళ్లాడు. పూర్తిగా కొత్తలుక్‌లో ఉండడంతో బీస్ట్‌ సెట్‌లో పావు గంట తిరిగినా అక్కడ ఉన్నవాళ్లలో ఒక్కరు కూడా కార్తిని గుర్తుపట్టలేకపోయార‌ట‌.

ఇక కొంత సేప‌టికి విజ‌య్‌ను క‌ల‌వ‌గా.. ఆయ‌న కూడా ఎవ‌రా? అన్న‌ట్టు కార్తిని చూశాడ‌ట‌. అప్పుడు నేను కార్తిని అని స్వయంగా చెప్పటంతో.. షాక్ అవ్వ‌డం విజ‌య్ వంతైంద‌ట‌. ఆ త‌ర్వాత హీరోలిద్ద‌రూ సినిమా మ‌రియు ఫ్యామిలీ విష‌యాలు చెప్పుకుంటూ.. అర గంట పాటు స‌ర‌దాగా గ‌డిపార‌ట‌.

Share post:

Latest