త్వరలో బుల్లితెరపై వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి కోలీవుడ్‌లో మాత్రమే కాదు పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక సినిమా ఒప్పుకుంటే చాలు దానిని తప్పకుండా చూడాల్సిందే అనేంతాల సినీ అభిమానుల్లో ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఇక ఇన్నాళ్లు వెండితెరపై అలరించిన విజయ్ సేతుపతి త్వరలో బుల్లితెర మీదకు వచ్చేస్తున్నారు.

సన్ టీవీలో వచ్చే నెల 7 నుంచి వీకెండ్స్‌లో ప్రసారమయ్యే ‘మాస్టర్ చెఫ్’ కుకరీ ప్రోగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని టీవీ నిర్వాహకులు అధికారికంగా తెలిపారు. ‘మాస్టర్ చెఫ్’ ప్రోగ్రాం తమిళంలో ప్రారంభించడం ఆనందకరంగా ఉందని ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ వ్యవస్థాపకుడు శరవణ ప్రసాద్ పేర్కొన్నారు. విజయ్ సేతుపతి తెలుగులో ‘సైరా’ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వగా ‘ఉప్పెన’ సినిమాలో ఫుల్ లెంథ్ రోల్ ప్లే చేశారు. ఈ సినిమాలో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇళయ దళపతి ‘మాస్టర్’ సినిమాలో భవానీగా విజయ్ సేతుపతి యాక్టింగ్ వేరే లెవల్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించడం విశేషం.