వెయ్యి మంది కావాల‌ట‌..రిస్క్ చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. లైగ‌ర్ క్లైమాక్స్ కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట పెట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న విజ‌య్‌.. లైగ‌ర్ షూటింగ్ 65 శాతం పూర్తి అయింద‌ని చెప్పుకొచ్చాడు.

ఇక క్లైమ్యాక్స్‌ సన్నివేశాల షూటింగ్ కు దాదాపు వెయ్యి మంది సెట్స్‌లో ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంతమందితో షూటింగ్ అంటే రిస్క్ తో కూడుకున్న పని. అయిన‌ప్ప‌టికీ అన్నీ ఆలోచించి షూటింగ్ ప్లాన్ రెడీ చేస్తున్నామని విజ‌య్ పేర్కొన్నారు. ఏదేమైనా ఈ క‌రోనా స‌మ‌యంలో వెయ్యి మందితో షూటింగ్ అంటే.. ఎంత రిస్క్ చేస్తున్న‌ట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Share post:

Popular