హాట్‌స్టార్‌లో వెంకీ `దృశ్యం 2`..విడుద‌ల‌కు డేట్ లాక్‌?

విక్ట‌రీ వెంక‌టేష్, మీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం దృశ్యం 2. మలయాళంలో మోహ‌న్ లాల్ న‌టించిన దృశ్యం 2ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ లో విడుద‌ల కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

దృశ్యం 2 శాటిలైట్‌, డిజిటల్‌, డైరెక్ట్‌-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్‌ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంద‌ట‌. ఇక‌ లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. దృశ్యం 2 విడుద‌ల‌కు డేట్ లాక్ చేశార‌ట. ఈ సినిమాను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 9 లేదా సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేయాల‌ని హాట్‌స్టార్ ప్ర‌తినిధులు భావిస్తున్నార‌ట‌.

మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, వెంకీ న‌టించిన మ‌రో చిత్రం నార‌ప్ప అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింద‌ని చెప్పాలి.

Share post:

Latest