ప్ర‌భాస్ `ఆదిపురుష్‌` కోసం బ‌రిలోకి దిగిన మ‌రో ఫేమ‌స్ న‌టుడు!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం ఆదిపురుష్‌. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బ‌డ్జెట్‌తో భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, సీతగా కృతి సనన్‌ నటిస్తోంది.

Kriti Sanon, Sunny Singh join cast of Prabhas-starrer 'Adipurush' - The  Hindu

లక్షణుడిగా సన్నీ సింగ్, రావసణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌నున్నారు. ఇక ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో మరి కొంత మంది నటీనటులు వచ్చి చేరుతున్నారు. తాజాగా మంబయిలోని స్టూడియోలో జరుగుతోన్న ఆదిపురుష్‌ షూటింగ్‌లో ప్రముఖ హిందీ టీవీ ఆర్టిస్ట్‌, హీరో వత్సల్‌ సేథ్‌ జాయిన్‌ అయ్యారు.

Image

ఈ విష‌యాన్ని స్వ‌యంగా వత్సల్ సేథ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. `కొత్త ఆరంభం.. #ఆదిపురుష్` అంటూ ఓం రౌత్‌తో దిగిన పిక్‌ను వత్సల్ సేథ్ షేర్ చేశాడు. దాంతో వత్సల్ ఆదిపురుష్‌లో ఏదో ముఖ్యమైన పాత్రలో న‌టించ‌బోతున్నాడ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంది. మ‌రి ముందు ముందు ఇంకెంత మంది తార‌లు ఈ మూవీ భాగం అవుతారో చూడాల్సి ఉంది.

Share post:

Latest