ఆ స్టైలిష్ డైరెక్ట‌ర్‌కు ఒకే చెప్పిన `ఉప్పెన` హీరో..త్వ‌ర‌లోనే..?

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.. త‌న రెండో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టికే పూర్తి చేశాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే వైష్ణవ్ తన మూడో చిత్రాన్ని ఇటీవ‌లె పట్టాలెక్కించాడు.

- Advertisement -

గిరీశయ్య దర్శకత్వంలో కేతికా శర్మ హీరోయిన్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇక వైష్ణ‌వ్ అన్నపూర్ణ బ్యానర్లో కూడా ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ హీరో ఇప్పుడు మ‌రో డైరెక్ట‌ర్ కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. టాలీవుడ్‌లో స్టైలిష్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సురేంద‌ర్ రెడ్డితో వైష్ణ‌వ్ ఓ మూవీ చేయ‌నున్నాడ‌ట‌.

Sye Raa' director's next to be with Prabhas or Mahesh Babu? | The News  Minute

వీరి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని భోగవల్లి ప్రసాద్ నిర్మించ‌నున్నాడ‌ని, అలాగే దర్శకుడు దశరథ్ కథను అందిస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నారు. అంతేకాదు, త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని టాక్‌. కాగా, ప్ర‌స్తుతం సురేంద‌ర్ రెడ్డి అక్కినేని అఖిల్‌తో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ త‌ర్వాత వైష్ణ‌వ్ తేజ్ సినిమా ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

Share post:

Popular