నల్గొండ జిల్లాలో వేడెక్కిన రాజకీయం..!

నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు రాజకీయ నాయకులు జిల్లాలో పట్టుకోసం పోరాడుతున్నారు. ఎవరికి వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలసులు బుధవారం అరెస్టు చేశారు.. ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగిందంటే..రెండు రోజుల క్రితం చౌటుప్పల్ లో  రేషన్ కార్డుల పంపిణీ జరిగింది.అయితే ఈ అధికారిక కార్యక్రమానికి హాజరైన కోమటిరెడ్డి.. తనకు ఆహ్వానం లేదని.. ప్రొటోకాల్ ను ప్రభుత్వం పాటించడం లేదని సభలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమానికి ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యేను ఆహ్వానించకపోతే ఎలా ప్రశ్నించారు.

మరో ముందడుగేసిన రాజగోపాల్.. మునుగోడు నియోజకవర్గంలో నిన్ను అడుగుపెట్టనివ్వబోనని పేర్కొన్నారు. దీంతో మంత్రి జగదీష్.. మరింత ఆగ్రహంతో నేనెందుకు రాను.. అక్కడికే వస్తా.. అని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి జగదీష్ బయలుదేరారు. విషయం తెలుసుకున్న కోమటిరెడ్డి తన అనుచరులతో మంత్రిని అడ్డుకునేందుకు హైదరాబాదు నుంచి అక్కడికి బయలుదేరారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు కోమటిరెడ్డిని అడ్డుకొని అరెస్టు చేశారు.  మంత్రి నుంచి మైక్ లాక్కున్నాడనే కారణంతో పోలీసులు ఇప్పటికే ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు నమోదు | Case Filed Against  Komatireddy Raj Gopal Reddy

Share post:

Latest