తళుకుల డ్రెస్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతున్న త‌మ‌న్నా..పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శ్రీ సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన త‌మ‌న్నా.. హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న త‌మ‌న్నా.. తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ న‌టించి మెప్పింది.

 తమన్నా లేటెస్ట్ ఫోటో షూట్ (Instagram/Photo)

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు కూడా చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ అభిమానుల‌కు మంచి కిక్ ఇస్తుంటుంది.

 తమన్నా లేటెస్ట్ ఫోటో షూట్ (Instagram/Photo)తాజాగా తళుకుల డ్రెస్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక త‌మ‌న్నా గ్లామ‌ర్ షోకు ఫిదా అయిన నెటిజ‌న్లు.. ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. మ‌రి త‌మ‌న్నా లేటెస్ట్ పిక్స్‌పై మీరూ లుక్కేసేయండి.

 తమన్నా లేటెస్ట్ ఫోటో షూట్ (Instagram/Photo)