జ‌ర్న‌లిస్టు పాత్రలో తాప్సీ..?

అందంతో, నటనతో తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో వరుస ఆఫర్ లతో దూసుకుపోతున్న తాప్సీ దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుంది. “మిషన్ ఇంపాజిబుల్‌” అంటూ సరికొత్త స్టోరీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వ‌రూప్ ఆర్జే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుప‌తిలో బౌంటీ హంట‌ర్స్ (డ‌బ్బులు తీసుకుని చంపే రౌడీలు) కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం.

- Advertisement -

అయితే ఈ చిత్రంలో మన సొట్టబుగ్గల సుందరి జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుందట. విభిన్న కథలను ఎంచుకునే తాప్సి తనదైన స్టయిల్ లో యాక్ట్ చేస్తూ ఎంతో మందిని మెప్పించింది. మరి ఈ సారి జర్నలిస్టుగా మారిన మన హీరోయిన్ అదే రచ్చ కొనసాగిస్తుందా..? రక్తపాతం సృష్టించే రౌడీల ఆట కట్టిస్తుందా.? వారి బండారం బయటపెట్టడానికి ఏం చేస్తుంది..? అనేది తెరపైన చూడాల్సిందే.

Share post:

Popular