సూర్య బ‌ర్త్‌డే..అదిరిపోయిన డ‌బుల్ ట్రీట్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య త‌న 40వ చిత్రాన్ని పాండిరాజ్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానితి మారన్ సమర్పణ లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. అయితే నేడు సూర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా నుంచి డ‌బుల్ ట్రీట్స్ వ‌చ్చాయి.

మొద‌ట ఫస్ట్ లుక్ వ‌దిలిన చిత్ర యూనిట్‌.. ఆ త‌ర్వాత సెకండ్ లుక్ ను కూడా విడుద‌ల చేశారు. వీటిలో అభిమానుల అంచనాలకు తగ్టట్లుగానే ఢిపరెంట్‌ గెటప్‌లో ద‌ర్శ‌నిమిచ్చాడు సూర్య‌. ఈ లుక్స్ బ‌ట్టీ చూస్తుంటే..చాలా కాలం తర్వాత సూర్య నుంచి మళ్లీ ఒక పవర్ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా రాబోతోంద‌ని స్ప‌ష్టం అర్థం అవుతోంది.

మొత్తానికి అదిరిపోయిన ఈ రెండు పోస్ట‌ర్లు సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్రానికి ఎతర్కుం తునిండవన్ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రంలో త‌మిళంలో పాటుగా తెలుగులోనూ విడుద‌ల కానుంది. అలాగే ఈ చిత్రానికి ఇమ్మన్ సంగీతం అందిస్తున్నారు.

Image

Share post:

Latest