కెఎల్ రాహుల్‌తో కూతురు ల‌వ్ ఎఫైర్‌..స్పందించిన సునీల్ శెట్టి!

బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు, హీరోయిన్ అథియా శెట్టి.. భారత యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు టెస్టు సిరీస్‌ నిమిత్తం రాహుల్ ఇంగ్లండ్‌లో ఉంటే.. అథియా కూడా అక్క‌డే ఉండ‌టం వీరి ల‌వ్ ఎఫైర్‌ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది.

అయితే కెఎల్ రాహుల్‌తో కూతురు ప్రేమాయ‌ణంపై సునీల్ శెట్టి తాజాగా స్పందించారు. అతియా ఇంగ్లండ్‌లో తన సోదరుడు అహాన్‌తో ఉంద‌ని, వాళ్లిద్దరూ సెలవులను ఎంజాయ్ చేస్తున్నార‌ని చెప్పిన సునీల్ శెట్టి.. `రాహుల్, అథియా చూడక్కని జంట. అందుకే ప్రముఖ ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ వీరిని అంబాసిడర్లుగా తీసుకుంది. యాడ్ కూడా బాగా వచ్చింది.

ఇక వారిద్ద‌రి రిలేషన్‌ గురించి నేను చెప్పడం కంటే వారినే డైరెక్ట్‌గా అడిగితే బాగుంటుంది` అని పేర్కొన్నారు. మొత్తానికి సునీల్ శెట్టి వ్యాఖ్య‌ల బ‌ట్టీ చూస్తుంటే.. రాహుల్‌, అథియా ప్రేమ మ‌రియు పెళ్లిని గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది.